ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
RCBvsLSG : అసలు ఇష్యూ ఎక్కడ మొదలైంది?.. కోహ్లీ, గంభీర్ గొడవ వెనుక ఏం జరిగింది?
Updated on: 2023-05-02 11:32:00

లక్నో, బెంగళూరు మధ్య మ్యాచ్ తర్వాత రెండు జట్ల ప్లేయర్ల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఇలా గొడవ పడినందుకు కోహ్లీ, గంభీర్, నవీన్ ఉల్ హక్కు బీసీసీఐ ఫైన్ కూడా వేసింది. అయితే అసలు ఈ గొడవ ఎందుకు మొదలైందని చాలా మంది రకరకాల విషయాలు చెప్తున్నారు. ఇలా కొందరు చెప్తున్న వివరాల ప్రకారం ఈ గొడవకు కారణం నవీన్ ఉల్ హకే.
ఈ మ్యాచ్ ఛేజింగ్లో 17వ ఓవర్లు సిరాజ్ బౌలింగ్ చేశాడు. అప్పుడు క్రీజులో అమిత్ మిశ్రా, నవీన్ ఉల్ హక్ ఉన్నారు. వికెట్ తీయడానికి వీళ్లను షార్ట్ బాల్తో ఇబ్బంది పెట్టాలని సిరాజ్కు కోహ్లీ సలహా ఇచ్చాడట. ఆ ఓవర్లో సిరాజ్ వేసిన తొలి షార్ట్ బాల్.. మిశ్రా బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బౌండరీ వెళ్లింది. ఈ క్రమంలో కోహ్లీ సలహా విన్న నవీన్ ఉల్ హక్ ఏదో కామెంట్ చేశాడని తెలుస్తోంది.నవీన్ ఉల్ హక్ అన్న మాటలకు కోహ్లీ, సిరాజ్ ఇద్దరికీ చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఆ ఓవర్ చివర్లో నవీన్ ఉల్ హక్ క్రీజులోనే ఉన్నా కూడా.. సిరాజ్ తన ఎదురుగా ఉన్న బంతి తీసుకొని నవీన్ వైపు సీరియస్గా చూసి వికెట్లపైకి విసిరేసి వెళ్లాడు. దీంతో నవీన్ ఉల్ హక్ మరింత కోపంగా కామెంట్స్ చేశాడు. ఇది చూసిన కోహ్లీ రంగంలోకి దిగి నవీన్పై సీరియస్ అయ్యాడు.