ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
గజ్వేల్ లో జర్నలిస్టు ఆత్మహత్య
Updated on: 2023-09-01 06:20:00

సిద్దిపేట జిల్లా గజ్వేల్ కేంద్రంగా పనిచేస్తున్నఓ పత్రిక రిపోర్టర్ వేణుమాధవ్(34) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుండి బయలుదేరిన అతను, తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేణు ఆచూకీ కోసం రంగంలోకి దిగిన పోలీసులు, బుధవారం సాయంత్రం గజ్వేల్ పట్టణంలోని ఎర్రకుంటలో మృతదేహాన్ని కనుగొన్నారు. ఆన్లైన్ అప్పుల భారం, వాటి వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతునికి భార్య, రెండేళ్ల వయస్సున్న ఇద్దరు కవల ఆడ పిల్లలున్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విరాహత్ అలీ గజ్వేల్ చేరుకొని, వేణు మృతదేహం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.