ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి ... నిజామాబాద్ కలెక్టర్
Updated on: 2023-08-31 09:42:00
జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం కింద నమోదైన కేసుల విచారణ వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను కోరారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్.. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న కేసులపై అధికారులు దృష్టి సారించాలని, కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి నిర్ణీత గడువులోగా చార్జిషీటు దాఖలు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ మండలాల్లో డివిజన్ల వారీగా అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షిస్తూ గత కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.