ముఖ్య సమాచారం
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్ గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించిన వైఎస్ షర్మిల
Updated on: 2023-04-29 21:59:00
చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేల పాలయ్యిందని షర్మిల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు.దీనిపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. జనగాం జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.చేతికొచ్చిన పంట మొత్తం నేలపాలయ్యింది.రైతులు సర్వం కోల్పోయారు ఒక్క బచ్చన్నపేట మండలంలోనే 10 వేల ఎకరాలకు పైగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇంత నష్టం జరిగినా కేసీఅర్ ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వలేదు గత నెల 23 న కేసీఆర్ హెలికాప్టర్ లో వచ్చాడు.10 వేల సహాయం అంటూ ప్రకటన చేశాడు. నెల రోజులు దాటినా ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదు. గత 9 ఏళ్లుగా దాదాపు 14 వేల కోట్ల పంట నష్టం జరిగింది. ప్రతి ఏటా 1500 కోట్ల నష్టం జరుగుతుంది.ముష్టి రైతు బందు ఇచ్చి కేసీఅర్ రైతును ఉద్ధరించినట్లు బిల్డప్ ఇస్తున్నాడు. కేసీఅర్ రైతు ద్రోహి ఒక్కో ఎకరాకు 30 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు లబో దిబో అంటున్నారు రైతు పరిహారం పై కేసీఅర్ కు అసలు విజన్ లేదు.30 వేలు నష్టం జరిగింది అని చెప్తుంటే 10 వేలు ఏ మూలకు సరిపోతాయి.ఎకరాకు 10 వేలు కాదు వెంటనే 30 వేలు నష్ట పరిహారం ఇవ్వాలి