ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఉంది
Updated on: 2023-04-25 18:50:00

దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి దిశలో ఉంది అని మాజీ మంత్రి,ఎమ్మెల్సీ,నాగర్ కర్నూలు జిల్లా ఆత్మీయ సమ్మేళన ఇంచార్జ్ పట్న మహేందర్ రెడ్డి అన్నారు. అలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు,రైతుబంధు,దళిత బంధు లాంటివి ఎక్కడ లేవని కెసిఆర్ ను కొనియాడారు. మంగళవారము కొల్లాపూర్ పట్టణం ఎస్ఎం ఫంక్షన్ హాల్ లో జరిగిన నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి హాజరయ్యారు. సభ ప్రారంభం అయ్యే ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సభకు రామచందర్ యాదవ్, రాష్ట్ర నాయకులు డిఎల్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దూరెడ్డి రఘువర్దన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న కొల్లాపూర్‌ను నియోజకవర్గ ప్రజలందరూ కలిసి కాపాడుకుందాం అని, కొల్లాపూర్ కోటపై గులాబీ జెండా ఎగురవేసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు గిఫ్టుగా ఇద్దామని అన్నారు. కేటీఆర్ ఆదేశానుసారం రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో సమావేశానికి వచ్చిన అందరికీ కూడా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.మన రాష్ట్రం వ్యవసాయ రంగంలో లాభసాటిగా మార్చిన వ్యక్తి మన కేసీఆర్ అని, నియోజకవర్గంలో కరెంటు ఉన్నందున మూడుసార్లు రైతులు పంటలు వేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి దూసుకుపోతుందని,రైతే దేశానికి వెన్నెముక లాంటివాడని,అందుకే రైతే రాజు అని అన్నారు.కేంద్ర ప్రభుత్వం రైతు పట్ల రైతు వడ్లను కొనకపోతే మన కెసిఆర్ కొనడం జరిగిందని అన్నారు.తెలంగాణ అభివృద్ధిని బిజెపి అడ్డుకుంటుందని ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దూసుకుపోతుందని అన్నారు. కొల్లాపూర్ లో హార్టికల్చర్, పాలిటెక్నిక్ మంజూరు చేసిన ఘనత కేసిఆర్ కు దక్కిందని, కొల్లాపూర్ అభివృద్ధిపై దమ్మున్న వ్యక్తి ఎవరైనా చర్చకు రావాలని సూటిగా ప్రశ్నించారు.పలు దీర్ఘకాలిక ప్రతి సమస్యలను పరిష్కరించామని,త్వరలోనే సింగోటం ఆలయం పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు.కొల్లాపూర్ పట్టణంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన నిధులతో అభివృద్ధి జరుగుతుందని,ఇప్పటికీ 6000 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇవ్వడం జరిగిందని అన్నారు.కొందరు వ్యక్తులకు ప్రజలతో పని లేకుండా సోషల్ మీడియాతో పని ఉంటుందని వారు కూడా సోషల్ మీడియా లాగానే వెళ్ళిపోతారని ఎద్దేవా చేశారు.పలు అభివృద్ధి కార్యక్రమాలపై బావాయిపల్లి రాజ వర్ధన్ రెడ్డి,హైకోర్టు అడ్వకేట్ రవి,యాపచెట్టు లాలు,బండిశీను,రాజేష్, మూల కేశవులు,జెడ్పిటిసిలు మేకల గౌరమ్మ,చిట్టెమ్మ, వెంకటరమణమ్మ పలు వ్యక్తులు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ నాయక్,ఎంపీపీ భోజయ నాయక్,ఉమ్మడి జిల్లా సింగల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కోడేరు మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సూర్య రాజశేఖర్ గౌడ్,ఆయా మండలాల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు,మండల బి ఆర్ ఎస్ పార్టీ,గ్రామ పార్టీ అధ్యక్షులు,సింగల్ విండో చైర్మన్లు,గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.