ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్న గోదావరి
Updated on: 2023-07-23 09:46:00

భద్రాచలం:రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి వరద పోటెత్తింది.దీంతో భద్రాచలం వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది.ఉదయం 6 గంటలకు వరద (Floods) ప్రవాహం 43.3 అడుగులకు చేరింది. దీంతో గోదావరి పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.ఇక ఎగువన వర్షాలతో గోదావరి ఉపనది అయిన పెన్గంగ ఉప్పొంగి ప్రవహిస్తున్నది.వరద ఉధృతి పెరగడంతో ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మడలం డొలారా వద్ద నది ఉగ్రరూపం దాల్చింది.50 అడుగుల ఎత్తు ప్రవహిస్తుండటంతో నీరు వంతెన పైనుంచి వెళ్తున్నాయి.దీంతో 44వ నంబర్ జాతీయరహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.మహారాష్ట్ర-తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి.వరద ఉధృతి తగ్గిన తర్వాత వాహనాలను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.