ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అయ్యబాబోయ్ ...సారూ.. నా గుడిసెకు రూ. 3,31,951 కరెంటు బిల్లు ఎట్టా వచ్చిందో కాస్త సెప్పండీ?..నోరు ఎల్ల బెట్టిన ..బాధితుడు
Updated on: 2023-07-11 11:38:00

ఓ సాధారణ ఆటో డ్రైవర్ ఇంటికి ఏకంగా రూ. మూడున్నర లక్షల కరెంట్ బిల్లు రావడంతో కళ్లు తేలేశాడు. చిన్నపూరి గుడిసెకు అంతపెద్ద మొత్తంలో కరెంటు బిల్లు రావడంతో లబోదిబో మంటూ అధికారులకు మొరపెట్టుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్ రాయవరం మండలంలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లాలోని ఎస్ రాయవరం పరిధిలోని గోకులపాడు దళిత కాలనీలోని పూరి గుడిసెలో రాజుబాబు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇంత చిన్న పూరి గుడిసెకు అంత పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లు రావడంతో రాజుబాబు కుటుంబ సభ్యులందరూ షాక్కు గురయ్యారు. దీనిపై విద్యుత్తు అధికారులను సంప్రదించగా.. సాంకేతిక సమస్య వల్ల పెద్ద మొత్తంలో బిల్లు వచ్చినట్లు గుర్తించారు. అనంతరం బిల్లును సరిచేసి ఈ నెల కరెంట్ బిల్లు రూ.155 వచ్చిందని తెలియజేశారు. సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగిందని, రాజుబాబుకి ఎస్సీ రాయితీ ఉండడంతో బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని కొరుప్రోలు సెక్షన్ ఏఈ గోపి వివరించారు.