ముఖ్య సమాచారం
-
మళ్లీ షాక్ ఇచ్చిన వెండి బంగారం... భారీగా పెరిగిన రేట్లు
-
:అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు
-
నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
-
రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి.. ఏప్రిల్‌లో కవిత కొత్త పార్టీ ప్రకటన!
-
మాజీ సైనికుల సమస్యలను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కరించాలి
-
రూ.6 వేలు పెరిగిన బంగారం, రూ.14 వేలు పెరిగిన వెండి ధర
-
:సుప్రీంకోర్టులో న్యాయవాది అవతారంలో మమతా బెనర్జీ
-
పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
దుర్గమ్మ పేరుతో నమ్మక ద్రోహం!
Updated on: 2026-01-22 09:50:00
దుర్గమ్మ చీరలిస్తాం..పూజలు చేస్తాం భక్తులకు సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్
విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పేరుతో.. సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. దేవస్థానం నుంచి ఫోన్ చేసినట్లుగా భక్తులను నమ్మిస్తూ.. డబ్బులను గుంజే ప్రయత్నాలు ఆరంభించారు. అమ్మవారి పట్టు చీరలు ఇంటికి పంపిస్తాం, మీ పేరు, గోత్ర నామాలతో పూజలు చేస్తామని భక్తులకు ఫోన్లు చేస్తున్నారు. వారిని నమ్మించి.. విరాళాల రూపంలో వసూళ్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై తాజాగా కొందరు భక్తులు ఫిర్యాదు చేయడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయం
అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయం పేరుతో ఎవరూ ఫోన్లు చేసి.. విరాళాలు, డబ్బులు అడగరనీ.. ఇలాంటివి నమ్మి మోసపోవద్దని ఈవో శీనానాయక్ వెల్లడించారు.
దేశవిదేశాల్లో ఉండే భక్తులే వారికి అవసరమైన సేవల గురించి.. ఆలయ అధికారిక వెబ్సైట్, సమాచార కేంద్రం, మనమిత్ర వాట్సాప్ సేవల ద్వారా నిత్యం తెలుసుకుంటారు. డబ్బులు కడితే.. అమ్మవారి చీరలు పంపిస్తాం. ప్రత్యేక పూజలు చేస్తామని.. దేవస్థానం నుంచి అధికారికంగా ఎవరూ భక్తులను సంప్రదించరు. కొద్దిరోజులుగా అపరిచిత వ్యక్తులు.. దేవస్థానం పేరుతో భక్తులను బురిడీ కొట్టించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ సైబర్ నేరగాళ్లు చేస్తున్న ప్రయత్నాలుగా తాము గుర్తించామని శీనానాయక్ తెలిపారు. వీటిపై భక్తులను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామనీ, ఆలయ ప్రాంగణంలోనూ.. మైక్‌లో ఇలాంటి వాటిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఏ టికెట్ అయినా...
దేవస్థానం వెబ్సైట్లో మాత్రమే దర్శనం, ఆర్జిత సేవల టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఈవో శీనానాయక్ తెలిపారు. ఫోన్ చేసి.. ఓటీపీలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను సైబర్ నేరగాళ్లు అడిగితే ఇవ్వొద్దంటూ సూచించారు.