ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
మాజీ సైనికుల పిల్లలకు మూడు శాతం ఎడ్యుకేషన్ లో రిజర్వేషన్ కల్పించాలి.
Updated on: 2025-12-01 21:15:00
బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ల కిరణకుమార్ ఆధ్వర్యంలో సోమవారం పాతకోటలో గల సంఘం కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా ఇటీవల ఎస్బిఐ బొబ్బిలిలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన భోగి ఈశ్వరరావుకు దుస్సాలువతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తగా రిటైర్డ్ అయిన వారికి భూముల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో మాజీ సైనికుల కోటా కింద రెండు శాతం జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎడ్యుకేషన్ సీట్ల రిజర్వేషన్లలో ఇప్పుడున్న రెండు శాతానికి మరొక శాతం కోటా పెంచి మాజీ సైనికుల పిల్లలకు ఉన్నత విద్య అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మరడరామినాయుడు, ఉపాధ్యక్షులు రెడ్డి రామకృష్ణ, కార్యదర్శి ఏ గోవింద నాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ ఆర్ మోహనరావు, ట్రెజరర్ వి ఎన్ శర్మ, సభ్యులు పాల్గొన్నారు.