ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారా లోకేశ్
Updated on: 2025-11-22 06:00:00
ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన
పాత పెన్షన్, తెలుగు మీడియం కొనసాగింపుపై సంఘం వినతి
అన్ని డిమాండ్లను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని లోకేశ్ హామీ
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇకపై బోధనపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని, వారికి ఎలాంటి బోధనేతర పనులు అప్పగించబోమని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, మాజీ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ నేతృత్వంలోని ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో వచ్చే నెలలో నిర్వహించే 'మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం)' మినహా ఉపాధ్యాయులకు ఇతర పనులేవీ ఉండవని హామీ ఇచ్చారు. డీఈఓ, ఎంఈఓలు కూడా కేవలం అభ్యసన ఫలితాలపైనే దృష్టి కేంద్రీకరించాలని, వారికి సర్వీస్ రూల్స్ వంటి బాధ్యతలు అప్పగించబోమని తేల్చిచెప్పారు. కడపలో విజయవంతమైన 'మోడల్ స్మార్ట్ కిచెన్ల'ను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత 17 నెలల్లో ఉపాధ్యాయ సంఘాలు తన దృష్టికి తెచ్చిన 423 సమస్యల్లో ఇప్పటికే 200 పరిష్కరించామని, మరికొన్ని పరిశీలనలో ఉన్నాయని వివరించారు.