ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
చేయడానికి పనులు ఉండవు, డబ్బుకు విలువ పోతుంది: ఎలాన్ మస్క్
Updated on: 2025-11-20 19:54:00
రాబోయే పది, ఇరవై ఏళ్లలో మనుషులు చేయడానికి పనులేమీ ఉండవని మస్క్ అన్నారు. "భవిష్యత్తులో చాలా పనులు ఆప్షనల్‌గా మారతాయి. ఇప్పుడు మనం క్రీడలు లేదా వీడియో గేమ్స్‌ను ఎలా ఆడుతున్నామో, రేపు ఉద్యోగం కూడా అలాగే ఉంటుంది. అవసరం కోసం కాకుండా కేవలం అభిరుచిని బట్టి పనులు చేసే రోజులు రానున్నాయి" అని వాషింగ్టన్లో జరిగిన యూఎస్-సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్‌లో మస్క్ వివరించారు.
ఏఐ, రోబోటిక్స్ పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తాయని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. పేదరికం ఒక సామాజిక సమస్య కాదని, అదొక ఇంజినీరింగ్ సమస్య అని అభివర్ణించారు. "ఏఐ, రోబోటిక్స్ ప్రాథమిక వస్తువులు, సేవల ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి. తద్వారా పేదరికం అంతమవుతుంది. ఏఐ, హ్యుమనాయిడ్ రోబోలు అందరినీ ధనవంతులుగా మారుస్తాయి" అని ఆయన పేర్కొన్నారు. హ్యుమనాయిడ్ రోబోల తయారీలో టెస్లా అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.