ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
అమ్మాయిలు అదరగొట్టేశారు..ఆస్ట్రేలియాను చిత్తు చేసి వరల్డ్ కప్ కు అడుగు దూరంలో కప్పుకు టీమ్ ఇండియా
Updated on: 2025-10-31 07:46:00
వరల్డ్ కప్ మొదలైన దగ్గర నుంచీ ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. దానికి తోడు ఏడు సార్లు ప్రపంచ కప్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్. అలాంటి జట్టును సెమీ ఫైనల్స్ లో హర్మన్ ప్రీత్ జట్టు మట్టి కరిపించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించి మరీ ఫైనల్స్ లోకి గర్వంగా అడుగు పెట్టింది. ఇందులో అందరి కంటే ముఖ్య పాత్ర వహించింది జెమీమా రోడ్రిగ్స్. అద్భుత ఇన్నింగ్స్‌తో జెమీమా సంచలనం సృష్టించింది. అజేయ శతకంతో (127: 134 బంతుల్లో 14 ఫోర్లు) మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ తో కలిసి వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జెమీమా..టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చింది.