ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
మునగసాగు చేసే వారికి లక్ష 49వేల రూపాయల ఆర్ధిక భరోసా
Updated on: 2025-10-19 07:54:00
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగసంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది.ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో మునగపంట సాగుచేసే రైతులను ప్రోత్సహించడానికి కొత్త ప్రణాళికను సిద్ధం చేసిన ఏపీ సర్కార్ డ్వాక్రా సంఘాలలోని మహిళా రైతులను ఈ పథకం అమలు చేయడానికి ఎంచుకుంది.2025- 2026 ఆర్థిక సంవత్సరంలో 12 జిల్లాలను మునగ పంటను సాగు చేయడానికి పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, ఆ తర్వాత ఈ పథకాన్ని రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాలకు విస్తరించి తద్వారా ఆదాయాన్ని, ఆర్థిక భరోసాను కల్పించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది.
మునగసాగు చేసే వారికి ఆర్ధిక భరోసా...
ఉపాధి హామీ పథకం కింద రెండేళ్లపాటు మునగ సాగు చేసే మహిళా రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2,177 మంది రైతులు 1814 ఎకరాలలో మునగ సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీరికి ఉపాధి హామీ పథకం కింద రెండేళ్లపాటు ఒక లక్షల 49 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ప్రభుత్వం ప్రోత్సహించనుంది.
మునగ రైతులకు ప్రోత్సాహకం అందించేలా ప్రభుత్వ నిర్ణయం...
25 సెంట్లు నుండి ఒక హెక్టార్ వరకు సాగు చేసే రైతులకు ఈ ప్రోత్సాహం వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని పెరియకులం ఉద్యాన విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన పి కే ఎం రకం మునగ విత్తన నాణ్యతను పరిశీలించి సెర్ప్ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు సూచిస్తున్నారు. ఎకరాకు నాలుగు వేల విత్తనాలను నాటాలని వాటిని కొనుగోలు చేసి విత్తడం ద్వారా మంచి దిగుబడి వస్తుందని సూచిస్తున్నారు.
ఎకరానికి నాలుగు లక్షలకు పైగా ఆదాయం...
ఇక ఇలా చేసే మునగ సాగుకు ఉపాధిహామీ పథకం కింద గుంతలు తగ్గడానికి విత్తనాలు నాటడానికి నీరు పెట్టి మొక్కలను పర్యవేక్షించడానికి నిధులను చెల్లిస్తారు. కోతకు వచ్చే ఈ మునగాకు పంట ద్వారా ఎకరానికి ఏడాదికి నాలుగు లక్షల 50 వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఒక్కసారి నాటితే ఐదేళ్ళ పాటు దిగుబడి...
ఒకసారి నాటితే ఐదేళ్లపాటు దిగుబడి వస్తుందని డ్వాక్రా మహిళలు దీనిని యూనిట్ గా తీసుకొని మునగ చేయడం ప్రారంభిస్తే పంట ఉత్పత్తిని అమ్మడానికి అధికారులు చొరవ తీసుకుంటున్నట్టు తెలుపుతున్నారు. ఎక్కువ మొత్తంలో మునగను కొనుగోలు చేసేలాగా కొన్ని ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని తద్వారా ఆర్థిక భరోసా కల్పించనున్నారు. ఎకరంలో మునగ తోట సాగుచేసే రైతులకు రెండేళ్లలో ఒక లక్ష 49వేల రూపాయలను ఉపాధి హామీ పథకం కింద ఇవ్వనున్నారు.
ఈ పథకంతో లబ్ది పొందాలంటే ఇలా చెయ్యండి...
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే రైతులు తమ భూమి పాసుబుక్ ను, బ్యాంక్ పాస్ బుక్, ఉపాధిహామీ జాబ్ కార్డు, జిరాక్స్ కాపీలను ఎంపీడీవో ఆఫీసులో కానీ మండల ఉపాధి హామీ కార్యాలయం లో గాని అందజేసి దరఖాస్తు చేసుకుంటే అర్హులైన రైతులకు అధికారులు సహాయం చేస్తారు.