ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
రాష్టం లో త్వరలో 190 కొత్త 108 వాహనాలు ప్రారంభం ..వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
Updated on: 2025-10-16 10:15:00
గాయాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. గాయపడిన వ్యక్తి బతికే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ అత్యవసర వైద్య సహాయం అందించాలంటే.. అంబులెన్స్‌లు కీలకం. అయితే రాష్ట్రంలో అంబులెన్స్‌ల కొరత ఉంది. ఉన్నవాటిలోనూ కొన్ని అంబులెన్స్‌లు తరచూ రిపేర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో 190 కొత్త 108 వాహనాలు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
గోల్డెన్ అవర్‌లోపే వైద్యం..
ఇప్పుడున్న అంబులెన్స్‌లతో పాటు కొత్తగా ప్రారంభించనున్న 190 కొత్త అంబులెన్స్‌లు.. రోగులు, క్షతగాత్రులను మరింత వేగంగా ఆస్పత్రులకు తరలించేందుకు వీలవుతుందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్వహణ సరిగా లేక.. డొక్కు, తుక్కుగా తయారై.. తరచూ రిపేర్ అవుతున్న అంబులెన్స్‌లను తొలగిస్తామని చెప్పారు. వాటి స్థానంలో కొత్త అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఫలితంగా గోల్డెన్ అవర్లోనే క్షతగాత్రులు వైద్యం సహాయం పొందుతారన్నారు.