ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
బొబ్బిలిలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన మాజీ సైనికులు
Updated on: 2025-10-02 10:03:00
గాంధీ జయంతి పురస్కరించుకొని బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం బొబ్బిలి పట్టణం చీపురుపల్లి వీధిలో ఉన్న గాంధీ విగ్రహానికి మాజీ సైనిక సభ్యులు మరియు గ్రీన్ బెల్ట్ సొసైటీ సభ్యులు కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వర్షానికి సైతం లెక్కచేయకుండా తమ దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం గాంధీ విగ్రహ ఆవరణలో నందివర్ధనం మొక్కను నాటారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు కిరణ్ మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి అనే ఆయన తత్వశాస్త్రంతో భారత స్వాతంత్య్ర ఉద్యమానికి రూపకల్పన చేశారు మహాత్మ గాంధీ అనీ,..ఇప్పటికీ ఈ నినాదంతో ఆయన ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారనీ కొనియాడారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రీన్ బెల్ట్ సొసైటీ అధ్యక్షులు ఎస్ వి రమణమూర్తి, మాజీ సైనికులు రెడ్డి రామకృష్ణ, ఎస్ఆర్ మోహన్ రావు, సిహెచ్ మోహన్ రావు, వి.ఎన్ శర్మ, వనమిత్ర కృష్ణ దాసు, తదితరులు పాల్గొన్నారు.