ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
కేరళను వణికిస్తున్న బ్రెయిన్ ఈటింగ్ అమీబా...
Updated on: 2025-09-25 16:31:00
కేరళలో మెదడుని తినే అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటీస్(పీఎఏఎం) వ్యాధి ప్రాణాలు తోడేస్తోంది. ఈ వ్యాధి బారినపడి ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. ప్రస్తుతం 80 మందికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వారంతా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధిసోకిన వారిలో 97 శాతం డెత్ రేటు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వరుస కేసులు నమోదు కావడం...21 మంది మృతి చెందడంతో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలను అప్రమత్తం చేస్తోంది. మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతేకాదు రాష్ట్రంలో అన్ని మైక్రో బయాలజీ ల్యాబ్‌లలో ఈ వ్యాధిని పరీక్షించే సౌకర్యాలను సైతం అభివృద్ధి చేసింది. అలాగే పీసీఆర్ పరీక్షల ద్వారా అమీబాను గుర్తిస్తున్నట్లు కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీనా జార్జ్ తెలిపారు.