ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
డీఎస్సీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో భారీ సభ
Updated on: 2025-09-13 16:16:00
ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నియామకాలపైన మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాల జారీ ముహూర్తం ఖరారైంది. మొత్తంగా 16,347 ఉద్యోగాల మెగా డీఎస్సీ తుది జాబితా ఈ నెల 15న విడుదల కానుంది. 19న అమరావతిలో సభ ఏర్పాటు చేసి ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. వీరికి దసరా సెలవుల్లో శిక్షణ ఇచ్చి... ఆ తరువాత విధుల్లో చేరేలా కార్యాచరణ ఖరారు చేసారు
డీఎస్సీలో ఎంపికైన వారికి పోస్టింగ్స్ పై ఏపీ విద్యాశాఖ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 15న ఎంపికైన తుది జాబితా ప్రకటించనుంది. ఈ నెల 19న అమరావతిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఈ క్రమంలోనే 19వ తేదీన సభ నిర్వహించి.. అక్కడే ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు అమరావతితో సచివాలయం సమీపంలో ఏర్పాట్లు చేస్తున్నారు.