ముఖ్య సమాచారం
-
ఏపీ ఇంటర్ పరీక్షల విధానంలో భారీ మార్పులు.. నెల ముందుగానే షెడ్యూల్
-
అల్పపీడనం ప్రభావం.. తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు..!!
-
జూరాల ప్రాజెక్ట్ ఎగువ నుంచి భారీగా కొనసాగుతున్న వరద
-
రష్యా, చైనా అధ్యక్షులను కలవనున్న మోడీ.. టియాంజిన్ చేరుకున్న ప్రధాని
-
బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం!
-
సెప్టెంబరు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
-
ముంబైకి రిలయన్స్ డబుల్ గిఫ్ట్: రెండు భారీ ప్రాజెక్టులు ప్రకటించిన నీతా అంబానీ
-
రెండు_అల్పపీడనాలు
-
నాలుగో రోజుకు చేరుకున్న గణపతి నవరాత్ర మహోత్సవాలు... శ్రీ వీర గణపతిగా దర్శనమిచ్చిన స్వామివారు
-
అల్లు అరవింద్ కు మాతృ వియోగం
అమెరికాకు భారత్ భారీ షాక్: కీలక ఆయుధ ఒప్పందాలకు బ్రేక్!
Updated on: 2025-08-08 19:45:00

అమెరికాతో కీలకమైన ఆయుధ కొనుగోలు ఒప్పందాలను భారత్ తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. భారత ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా భారీ సుంకాలను విధించడంతో, ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలను ఉటంకిస్తూ 'రాయిటర్స్' కథనం పేర్కొంది. ' ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. భారత్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో సుమారు 3.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.30 వేల కోట్లు) విలువైన రక్షణ ఒప్పందాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇందులో భారత సైన్యం కోసం స్ట్రైకర్ యుద్ధ వాహనాలు, జావెలిన్ యాంటీ-ట్యాంక్ క్షిపణులతో పాటు, నౌకాదళం కోసం ఆరు బోయింగ్ పీ-8I గూఢచార విమానాల కొనుగోలుకు సంబంధించిన చర్చలు కూడా ఉన్నాయి. ఈ ఒప్పందాలను ఖరారు చేసేందుకు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్వరలో వాషింగ్టన్లో పర్యటించాల్సి ఉండగా, ఆ పర్యటన కూడా రద్దయినట్టు సమాచారం.