ముఖ్య సమాచారం
-
ఏపీ ఇంటర్ పరీక్షల విధానంలో భారీ మార్పులు.. నెల ముందుగానే షెడ్యూల్
-
అల్పపీడనం ప్రభావం.. తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు..!!
-
జూరాల ప్రాజెక్ట్ ఎగువ నుంచి భారీగా కొనసాగుతున్న వరద
-
రష్యా, చైనా అధ్యక్షులను కలవనున్న మోడీ.. టియాంజిన్ చేరుకున్న ప్రధాని
-
బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం!
-
సెప్టెంబరు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
-
ముంబైకి రిలయన్స్ డబుల్ గిఫ్ట్: రెండు భారీ ప్రాజెక్టులు ప్రకటించిన నీతా అంబానీ
-
రెండు_అల్పపీడనాలు
-
నాలుగో రోజుకు చేరుకున్న గణపతి నవరాత్ర మహోత్సవాలు... శ్రీ వీర గణపతిగా దర్శనమిచ్చిన స్వామివారు
-
అల్లు అరవింద్ కు మాతృ వియోగం
లైంగిక సమ్మతి వయసు 18 ఏళ్లే... తగ్గించే ప్రసక్తే లేదు: కేంద్రం స్పష్టీకరణ
Updated on: 2025-08-08 07:53:00

లైంగిక కార్యకలాపాలకు చట్టపరమైన అంగీకార వయసును 18 ఏళ్ల నుంచి తగ్గించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది. కౌమార దశలో ఉండే ప్రేమ వ్యవహారాలను కారణంగా చూపి, ఈ వయసును తగ్గించాలన్న వాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. మైనర్ల రక్షణే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని, ఈ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేసింది. ఈ వయోపరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలంటూ సీనియర్ న్యావాది ఇందిరా జైన్సింగ్ చేసిన వాదనకు స్పందనగా ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టుకు తెలిపింది.
మైనర్లను లైంగిక వేధింపుల నుంచి కాపాడేందుకు 18 ఏళ్ల వయోపరిమితి చాలా కీలకమని ప్రభుత్వం తన వాదనలో పేర్కొంది. ఈ నిబంధనను కఠినంగా, దేశవ్యాప్తంగా ఒకేలా అమలు చేయాలని నొక్కి చెప్పింది. ఒకవేళ ఈ వయసును తగ్గిస్తే, బాలల పరిరక్షణ కోసం దశాబ్దాలుగా చేసిన కృషి నీరుగారిపోతుందని, 'పోక్సో' (లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం) వంటి కఠిన చట్టాలు బలహీనపడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. 18 ఏళ్ల లోపు వారికి లైంగిక అంగీకారంపై సరైన అవగాహన, పరిణతి ఉండవని, వయసు తగ్గింపు వారి సంక్షేమానికి పెను ముప్పుగా మారుతుందని కేంద్రం వివరించింది.