ముఖ్య సమాచారం
-
ఏపీ ఇంటర్ పరీక్షల విధానంలో భారీ మార్పులు.. నెల ముందుగానే షెడ్యూల్
-
అల్పపీడనం ప్రభావం.. తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు..!!
-
జూరాల ప్రాజెక్ట్ ఎగువ నుంచి భారీగా కొనసాగుతున్న వరద
-
రష్యా, చైనా అధ్యక్షులను కలవనున్న మోడీ.. టియాంజిన్ చేరుకున్న ప్రధాని
-
బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం!
-
సెప్టెంబరు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
-
ముంబైకి రిలయన్స్ డబుల్ గిఫ్ట్: రెండు భారీ ప్రాజెక్టులు ప్రకటించిన నీతా అంబానీ
-
రెండు_అల్పపీడనాలు
-
నాలుగో రోజుకు చేరుకున్న గణపతి నవరాత్ర మహోత్సవాలు... శ్రీ వీర గణపతిగా దర్శనమిచ్చిన స్వామివారు
-
అల్లు అరవింద్ కు మాతృ వియోగం
మళ్లీ కలిసిపోతున్న సైనా నెహ్వాల్-పారుపల్లి కశ్యప్!
Updated on: 2025-08-03 10:39:00

భర్త పారుపల్లి కశ్యప్‌తో విడిపోతున్నట్టు ఇటీవల ప్రకటించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తాజాగా మరో సంచలన విషయాన్ని వెల్లడించింది. 35 ఏళ్ల సైనా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కశ్యప్‌తో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ "కొన్నిసార్లు దూరం, సాన్నిహిత్యం విలువను నేర్పుతుంది. మేము ఇప్పుడు మళ్లీ ప్రయత్నిస్తున్నాం" అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వారి అభిమానులను, క్రీడా ప్రపంచాన్ని ఆనందంలో ముంచెత్తింది. తన భర్త కశ్యప్‌తో విడిపోతున్నట్టు సైనా నెహ్వాల్ గత నెలలో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2018లో వివాహం చేసుకున్న ఈ జంట ఆరు సంవత్సరాలకు పైగా కలిసి జీవించారు. "కొన్నిసార్లు జీవితం మమ్మల్ని వేర్వేరు దిశల్లోకి నడిపిస్తుంది. బాగా ఆలోచించిన తర్వాత మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం" అని సైనా గతంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది.