ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అంతుచిక్కని హృదయ వేదన
Updated on: 2025-07-03 09:17:00

బెంగళూరు (గ్రామీణం) : హాసనతో పాటు ఆయా జిల్లాల్లో చిన్నవయసులోనే గుండెపోటుకు గురై మరణించిన యువత, మధ్యవయసు వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యుల సమితి భేటీ అయ్యే ప్రక్రియను ప్రారంభమయ్యింది.
జయదేవ ఆసుపత్రి వైద్యాధికారి నేతృత్వంలోని 12 మంది వైద్యులు ఆయా గ్రామాలకు వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. పొగ తాగడం, మద్యం అలవాటు, ఫాస్ట్ఫుడ్ ఎక్కువగా తినడం, కొవ్వు ఎక్కువగా ఉండడంతోనే ఎక్కువ మరణాలు జరిగాయని ప్రాథమిక దర్యాప్తు, బాధితుల వైద్య నివేదికల ఆధారంగా అంచనాకు వచ్చారు. కొవిడ్ సమయంలో వేసుకున్న టీకాతో మరణాలు సంభవించాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఏమీ లేదని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన విషయాన్ని ఆరోగ్య శాఖ అధికారి గౌరవ్ గుప్త స్పష్టం చేశారు. బెంగళూరు రూరల్ ప్రాంతంలో గత వారం రోజులుగా గుండెపోటుతో యువకులు, మధ్య వయసు వారు పదుల సంఖ్యలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే