ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
భారీగా పతనమైన బంగారం ధర: ఒక్కరోజే రూ.930 తగ్గుదల..
Updated on: 2025-06-27 21:02:00

శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం (99.9 శాతం స్వచ్ఛత) ధర రూ.930 తగ్గి రూ.97,670కి చేరింది. గురువారం ముగింపు ధర రూ.98,600గా ఉన్నట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. అదేవిధంగా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా రూ.850 తగ్గి రూ.97,200 వద్ద స్థిరపడింది. గురువారం ఈ రకం బంగారం ధర రూ.98,050గా ఉంది.
అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీయడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర పతనమైంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశాజనక నివేదికలు రావడంతో పెట్టుబడిదారులు బంగారంపై అమ్మకాలకు మొగ్గు చూపారు. దీనికి తోడు లాభాల స్వీకరణ కూడా తోడవడంతో పసిడి ధర ఒక్కరోజే భారీగా దిగివచ్చింది
."ఇరాన్ సంయమనం పాటించడంతో ముడి చమురు ధరలు కూడా తగ్గాయి. ఇది మార్కెట్లో రిస్క్ భయాన్ని తగ్గించి బంగారం ధరలపై మరింత ఒత్తిడి పెంచింది" అనిఅబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ చింతన్ మెహతా వివరించారు.