ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
93 ఏళ్ల టెస్ట్ క్రికెట్లో టీమిండియా అరుదైన ఘనత!
Updated on: 2025-06-24 12:53:00

ఇంగ్లండ్‌తో జరుగుతున్న లీడ్స్ టెస్టులో భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తమ 93 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రస్థానంలో (1932లో తొలి టెస్ట్ ఆడింది) ఒకే టెస్ట్ మ్యాచ్‌లో ఏకంగా ఐదు సెంచరీలు నమోదు చేయడం ఇదే తొలిసారి.టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక జట్టు ఒకే మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేయడం ఇది కేవలం ఆరోసారి మాత్రమే.
విదేశీ గడ్డపై ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు 1955లో కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా ఈ ఫీట్ సాధించింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు కోలిన్ మెక్‌డొనాల్డ్ (127), నీల్ హార్వే (204), కీత్ మిల్లర్ (109), రాన్ ఆర్చర్ (128), రిచీ బెనాడ్ (121) ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు సెంచరీలు సాధించారు. దాంతో ఆసీస్ 758/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందింది.
కాగా, భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే, 371 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 350 పరుగులు చేయాల్సి ఉంది. గిల్ సేన గెలవాలంటే పది వికెట్లు పడగొట్టాలి. దీంతో చివరి రోజు ఆటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది