ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఇరాన్‌పై అమెరికా దాడులు: కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు.. చమురు ధరలు పైపైకి!
Updated on: 2025-06-23 11:19:00

మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులు చేయడంతో సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీయ సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ సుమారు 500 పాయింట్ల నష్టంతో ప్రారంభమై, కొద్దిసేపటికే 800 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ కూడా దాదాపు 250 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 9:45 గంటల సమయానికి సెన్సెక్స్ 81,560 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24,859 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.మధ్యప్రాచ్య సంక్షోభం తీవ్రరూపం దాల్చడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జనవరి తర్వాత అత్యధిక స్థాయికి చేరుకుని 2 శాతం పెరిగాయి. ప్రపంచంలోని ఐదో వంతు ముడి చమురు రవాణా అయ్యే హార్ముజ్ జలసంధిని మూసివేయడంపై ఇరాన్ తీసుకునే నిర్ణయం కోసం అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు ఆందోళనగా ఎదురుచూస్తున్నాయి. చమురు ధరల పెరుగుదల కరెన్సీ మార్కెట్లపైనా ప్రభావం చూపింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 17 పైసలు క్షీణించి 86.72 వద్ద స్థిరపడింది.