ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
గిన్నిస్ రికార్డు సాధిస్తాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
Updated on: 2025-06-17 07:21:00

"11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు విశాఖ అనువైన ప్రదేశం, మీరు చేయగలుగుతారని ప్రధాని మోదీ చెప్పగానే విజయవంతంగా చేస్తామని చెప్పా. యోగాను ప్రపంచమంతా జరుపుకునేలా ప్రధాని మోదీ కృషి చేశారు. 21వ తేదీన పౌరులు పాల్గొనేందుకు ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సుందర నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం చేయడం మన అదృష్టం. యోగా భవిష్యత్తులో అందరి జీవితంలో భాగం కావాలి. టెక్నాలజీ యుగంలో తీరికలేకుండా గడుపుతున్నాం. అందరిలో ఉండే ఆందోళన, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలకు యోగా పరిష్కారం. రాష్ట్రంలో యోగాంధ్ర థీమ్‌తో నెలరోజులపాటు కార్యక్రమం చేపట్టాం. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా నెల రోజులుగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 1 లక్ష ప్రదేశాల్లో నిర్వహిస్తాం. 2 కోట్లమంది యోగా డేలో పాల్గొంటారు. ఇప్పటికే 2.17 కోట్లమంది పాల్గొంటామని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 25 లక్షల మందికి సర్టిఫికెట్లు ఇస్తాం. గిన్నిస్ రికార్డుకు ప్రయత్నిస్తున్నాం..తప్పకుండా సాధిస్తాం".