ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
వరితో సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు
Updated on: 2025-05-29 05:58:00

భారతదేశంలోని అన్నదాతలకు గుడ్ న్యూస్... కేంద్రంలోని మోదీ సర్కార్ వరికి కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటన చేశారు.
రాబోయే ఖరీఫ్ 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం వరికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాల్‌కు రూ. 69 పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీంతో వరి (సాధారణ రకం) ఎంఎస్పీ క్వింటాల్‌కు రూ. 2,369కి చేరుకుంది. ఇక, వరి (గ్రేడ్ ఏ) ఎంఎస్పీని కూడా రూ. 69 పెంచడంతో క్వింటాల్ ధర రూ. రూ. 2,389కి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది.
వరితో పాటు మొత్తం 14 ఖరీఫ్ పంటలకు సవరించిన ఎంఎస్పీలను కూడా కేబినెట్ ఆమోదించింది. అత్యధికంగా నైజర్ సీడ్ క్వింటాలుకు రూ. 820, క్వింటాలు రాగి రూ. 596, క్వింటాల్ పత్తి రూ. 589, క్వింటాల్ నువ్వులు రూ. 579 పెంపునకు సీసీఈఏ ఆమోదం తెలిపింది.