ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
జకోవిచ్ అరుదైన ఘనత... @ 100 టైటిల్స్
Updated on: 2025-05-25 07:42:00

సెర్బియా టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ అరుదైన ఘనత సాధించాడు. జెనీవా ఓపెన్‌లో విజయంతో కెరీర్లో 100 టైటిళ్ల మైలురాయిని చేరుకున్నాడు.
శనివారం జరిగిన జెనీవా ఓపెన్ ఫైనల్లో హుబెర్ట్ హుర్కాజ్‌ను 5-7, 7-6 (2), 7-6 (2) తేడాతో ఓడించి జకోవిచ్ తన కెరీర్లో 100వ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. విజయం తర్వాత సెర్బియన్ స్టార్ మాట్లాడుతూ... "ఇక్కడ 100వ సింగిల్స్ టైటిల్ సాధించినందుకు ఆనందంగా ఉంది. నేను దాని కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. మ్యాచ్ మొత్తంలో హుబెర్ట్ నాకన్నా విజయానికి దగ్గరగా ఉన్నాడు. అతను తన సర్వ్‌ను ఎలా బ్రేక్ చేశాడో నాకు తెలియదు. హుబెర్ట్ 4-3 ఆధిక్యంలో ఉన్నప్పుడు బహుశా తనను తాను బ్రేక్ చేసుకుని ఉండవచ్చు. అతడు చాలా అద్భుతంగా ఆడాడు. ఇది చాలా టఫ్ ఫైట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు" అని జకోవిచ్ అన్నాడు.