ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
పగలు కొత్తిమీర, కరివేపాకు అమ్ముతూ.... రాత్రులు చోరీలు
Updated on: 2025-05-24 14:03:00

పగలు కొత్తిమీర కరేపాకు అమ్ముతూ.... రాత్రుళ్ళు చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను గుడివాడ డిఎస్పి ధీరజ్ వినీల్ మీడియా సమావేశంలో వెల్లడించారు.పమిడిముక్కల, కూచిపూడి పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ముఠా సభ్యులను పట్టుకున్నారు.వారి వద్ద 3 లక్షలు విలువైన 26 గ్రాములు బంగారం.....562 గ్రాముల వెండి ,3500 నగదు ,రెండు మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలియజేశారు. ముఠా సభ్యులపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని,నిందితుల్లో ఒకరు మైనర్ కావడం విశేషమన్నారు.పగలు కొత్తిమీర కరివేపాకు అమ్ముతున్నట్లు ఊర్లలో తిరుగుతూ, తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి, రాత్రిళ్ళు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని గుడివాడ డిఎస్పి ధీరజ్ వినీల్ తెలియజేశారు.