ముఖ్య సమాచారం
-
చైనాలో ఓ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం... 22 మంది మృతి
-
మోడీ సంచలన నిర్ణయం.. రంగంలోకి త్రివిధ దళాలు..
-
ఏపీలోనూ మావోయిస్టుల కలకలం... అల్లూరి జిల్లాలో కాల్పులు
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
ఏపీలోనూ మావోయిస్టుల కలకలం... అల్లూరి జిల్లాలో కాల్పులు
Updated on: 2025-04-29 20:34:00

ఏపీలో నక్సల్ కలకలం రేగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టుల కదలికలపై అందిన నిర్దిష్ట సమాచారంతో భద్రతా బలగాలు ఏజెన్సీలో కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. పోలీసులను గమనించిన మావోయిస్టులు వెంటనే వారిపైకి కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కూడా ప్రతిగా కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య కొంతసేపు కాల్పులు కొనసాగిన అనంతరం, మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకొని దట్టమైన అడవిలోకి పారిపోయినట్టు తెలుస్తోంది. పరారైన మావోయిస్టుల కోసం పోలీసులు, ప్రత్యేక బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ గాలింపును తీవ్రతరం చేశాయి. పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో గత కొన్నాళ్లుగా మావోయిస్టుల వేట కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం బీజాపూర్ జిల్లా పరిధిలోని నడిపల్లి-గల్గామ్ గ్రామాల మధ్య అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే భద్రతా జవాన్లు ఎదురుకాల్పులు జరపడంతో అక్కడ కూడా ఇరువర్గాల మధ్య ఫైరింగ్ జరిగింది.