ముఖ్య సమాచారం
-
మోడీ సంచలన నిర్ణయం.. రంగంలోకి త్రివిధ దళాలు..
-
ఏపీలోనూ మావోయిస్టుల కలకలం... అల్లూరి జిల్లాలో కాల్పులు
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
Updated on: 2025-04-29 16:33:00

అనుమానం పెనుభూతమై....భార్యను కిరాతకంగా నరికి చంపేందుకు యత్నించిన దారుణ ఘటన కృష్ణాజిల్లా గుడివాడలో చోటుచేసుకుంది. భర్త విచక్షణ రహితంగా పోడవడంతో తీవ్రంగా గాయపడిన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. గుడివాడ ఇందిరాగారి కాలనీలో నివాసముంటున్న మట్టా అశోక్, భూమిక దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహం అయింది వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న అశోక్ దురాలవాట్లకు బానిసై, తరచు భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఇటీవల జరిగిన గొడవతో పిల్లలు తీసుకొని భార్య భూమిక స్థానికంగానే నివాసం ఉంటున్న తల్లి రాణి ఇంటికి వెళ్ళింది. ఈ క్రమంలో మంగళవారం తన బట్టలు తీసుకునేందుకు చెల్లి అనుష్కతో కలిసి ఇంటికి వెళ్ళిన భూమికపై భర్త అశోక్ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి, ముఖంపై, పొట్టలో పొడిచేశాడు. అడ్డుకుబోయిన చెల్లి అనుష్క పై కూడా దాడి చేయడంతో చేతికి తీవ్ర గాయం అయింది. గాయపడిన ఇరువురిని హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. భూమిక పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తరలించారు. దురాలవాట్లకు బానిసై తరచూ కుమార్తె భూమికను అల్లుడు కొడుతూ ఉంటాడని తల్లి రాణి కన్నీటి పర్యంతమైంది. కేసు నమోదు చేసిన గుడివాడ టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీ లో ఉన్న అశోక్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.