ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
శ్రీఖాద్రీ నృసింహుడు దక్షిణ కాశి ... కదిరి
Updated on: 2023-04-20 11:22:00

లోకకంఠకుడైన హిరణ్యకశ్యపుడనే దానవుడి సంహారార్ధమై మహోగ్రరూ సంతో స్తంభం నుంచి ఆవిర్భవించిన ఉగ్ర నరసింహుడు ప్రశాంత వదనం తో ప్రహ్లాద సమేతంగా కదిరిలో కొలువు దీరాడు. నాటి నుంచి నేటి వరకు క్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల కోర్కెలు నెరవేర్చుతూ భక్తవ నారసింహుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి మూలవిరాట్టు నుంచి అభిషేకం అనంతరం స్వేద బిందువులు జనించటం శ్రీలక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్తు కాలుపై ఉన్నాడనేందుకు నిదర్శనంగా విశ్వసిస్తున్నారు. మనిషిని బంధ విముక్తుడిని చేయటంతో పాటు ముక్తిని ప్రసాదించే పలు పవిత్రతీర్థాలు కలిగిన ఈ క్షేత్రాన్ని కాశీ, గయ, ప్రయాగ, శ్రీరంగం, శ్రీముష్ణము, వెంకటాచలం, బదరికాశ్రమాల కంటే శ్రేష్టమైనదిగా బ్రహ్మాండ పురాణం చెబుతోంది. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు కదిరికి తూర్పున ఉన్న స్తోత్రాద్రి పై పాదం మోపినట్లు చిహ్నాలు వేటికీ ఉన్నాయి. ఈ కారణంగానే విష్ణువు పాదం మోపిన కొండ కావటంతో ఈ ప్రాంతానికి ఖాద్రి అనే పేరు వచ్చింది. వాడుకలో ఇది కదిరిగా రూపాంతరం చెందింది.
కదిరి పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలోని పాతరేపల్లె పట్టణం (పట్నం) పాలించిన పాటిగాడు, రంగనాయండికి నరసింహస్వామి స్వప్నంలో కనిపించి వర్మీకం(పుట్ట)లో ఉన్న తన ఆర్చాబింబాన్ని వెలికితీసి ఆలయాన్ని నిర్మించాలని కోరినట్లు స్థల పురాణం చెబుతోంది. దీంతో పాలేగాడు వల్మీకంలో శేషబద్ధమై ఉన్న శిలా సాలగ్రామాన్ని దర్శించి వెలికితీసి ప్రతిష్ఠించటంతోపాటు ఇక్కడ గర్భాలయం నిర్మించారు. అనంతరం క్రీ.శ. 1274లో వీరబుక్కరాయల హయాంలో ఆలయం నిర్మించినట్లు చారిత్రక ఆధారం. తరువాత కాలంలో క్రీ. శ. 1509లో శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ 1569లో తిరుమల రాయలు, క్రీ. శ. 1424-1503 మధ్య ప్రసిద్ధ వాగ్గేయకారులు తాళ్లపాక అన్నమాచార్యులు సందర్శించి ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. తరువాత ఈ ప్రాంతాన్ని పాలించిన పాలేగాళ్ళు ఆలయానికి దక్షిణ భాగంలో నరసింహాస్వామి ఆలయం నిర్మించారు. స్వామి దర్శనానికి ఇక్కడికి వచ్చే భక్తులు దుర్గాదేవిని లక్ష్మి అమ్మవారిగా భావించి పూజలు నిర్వహించేవారు. దీంతో దుర్గాదేవి ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారిని ప్రతిష్టించారు
దేశంలోనే మూడవ అతిపెద్దదైన రథం (తేరు)పై ఏటా ఫాల్గుణ మాసంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనారసింహస్వామి బ్రాహ్మరథారూరుడై తిరువీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగులు ఎత్తు కలిగిన ఈ రథంలో పీఠం వెడల్పు 16 అడుగులు. 120 ఏళ్ల క్రితం తయారు చేసిన ఈ రథం చక్రాలు ఒక అడుగు అంగుళం వెడల్పుతో 8 అడుగుల వ్యాసార్ధం కలిగి ఉన్నాయి. టేకు కలపతో రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులను అందంగా తీర్చిదిద్దారు.