ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి #
Updated on: 2025-04-22 21:22:00

గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గల స్థానిక టిడ్కో కాలనీ నందు బ్లాక్ నంబర్ A-26 వద్ద ఈరోజు అనగా 22 04.2025 ఉదయం సుమారు 11.00 గంటల సమయంలో నారి సంతోష్ s/o చంటి, వయసు 14సం, జగనన్న కాలనీ, గుడివాడ అనే పిల్లవాడు తన తల్లి యొక్క ఆదేశం మేరకు వారి యొక్క మూసి వేయబడిన చికెన్ పకోడీ కొట్టు దగ్గరకు గ్యాస్ పొయ్యి తీసుకువచ్చే నిమిత్తం వెళ్లి సదరు కొట్టు గుంజకు కట్టబడి వేలాడుతున్న కొట్టు గుంజకు కట్టి వేలాడుతున్న GA వైరు కు తగిలి దానికి పైన ఉన్న విద్యుత్ వైరు ద్వారా విద్యుత్ సరఫరా అవుతూ ఉన్నందున అతనికి షాక్ తగలగా పక్కనే ఉన్న దొండపాటి రవితేజ అనే యువకుడు పిల్లవాడిని కాపాడే ప్రయత్నం చేసి అతడిని విడిపించగా రవితేజ కు పక్కనే ఉన్న విద్యుత్ వైరు వీపు భాగంలో తాకి విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి, అతడిని కాపాడేందుకు మరో ముగ్గురు కొవ్వూరు నాగరాజు s/o వీరయ్య, వయసు 45సం, ద్రోణాదుల వీధి, పీట రామస్వామి s/o శివనగరాజు, వయసు 40సం, కాజా, మొవ్వ మండలం, మరియు షేక్ మస్తాన్, నందిగామ అను వారు ప్రయత్నం చేయగా వారికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయి, వెంటనే విద్యుత్ షాక్ తగిలిన వారిని గుడివాడ గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సుమారు 12 .00 గంటల సమయంలో దొండపాటి రవితేజ s/o వెంకట్రావు, వయసు 27సం, కులం- వడ్డెర, రమణ కాలనీ, నందిగామ ప్రస్తుత నివాసం TIDCO అనే యువకుడు మృతి చెందినాడు అతను ప్రస్తుతం గుడివాడ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నిమిత్తం గుడివాడ వచ్చి ఉంటున్నాడు, మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు, దీనిపై గుడివాడ తాలూకా ఎస్ఐ శ్రీ నంబూరి చంటి బాబు గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.