ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
రెబ్బెన మండలంలోని జక్కులపల్లి గ్రామంలో జరిగిన ఇద్దరి హత్య కేసులో 13 మంది నిందితులు అరెస్ట్
Updated on: 2023-06-29 07:30:00
వివరాల్లోకి వెళితే .... మండల బక్కయ్య కు జక్కులపల్లి గ్రామా శివారులో వ్యవసాయ భూమి కలదు. ఇటీ భూమి విషయంలో బక్కయ్య కుటుంబికులకు మరియు మండల మెంగయ్య కుటుంబికులకు గొడవలు జరుగుతున్నవి. Dt 25/06/2023 రోజున బక్కయ్య వాళ్ళు పత్తి విత్తనాలు వేసినారు. అది తెలిసిన మండల మెంగయ్య అతని కుటుంబ సభ్యులు/నిందితులు Dt 26/06/2023 రోజున కత్తులు, గొడ్డలితో, రాళ్లతో, కారంపొడితో, ఆ భూమిలోకి వెళ్ళినారు. అది చుసిన బక్కయ్య అతని కుటుంబ సభ్యులు వారిని ఆపడానికి వెళ్ళినపుడు నిందితులు అట్టి కత్తులు, గొడ్డలితో, రాళ్లతో, కారంపొడితో బక్కయ్య కుటుంబసభ్యులపై దాడి చేసినారు. ఈ దాడి లో మండల నర్సయ్య,గీరుగుల బక్కక్క మృతి చెందినారు. మిగతావారికి రక్త గాయాలు అయినవి. తర్వాత నిందితులు అక్కడినుండి పారిపోయినారు. ఈ విషయమై మండల ఇందిరా పిర్యాదు మేరకు రెబ్బెన PS నందు Cr No 90/2023 , U/sec 143, 147, 148, 302, 307 r/w 149 IPC ప్రకారం కేసు నమొదు చెసారు ఈ కేసుని చేదించడంలో శ్రీ సురేష్ కుమార్ IPS ఆదేశాలమేరకు సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు శ్రీ అల్లెం నరేందర్ CI రెబ్బెన , భూమేష్ SI రెబ్బెన గారులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 13 మంది నిందితులను అరెస్ట్ చేసి ఈరోజు ఆసిఫాబాద్ కోర్ట్ నందు హాజరుపరచారు