ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలు
Updated on: 2025-04-14 14:31:00

బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మరడ రామినాయుడు ఆధ్వర్యంలో సభ్యుల బృందం దిబ్బగుడ్డివలస గ్రామంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన 135వ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్.అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి భారత గడ్డపై ఉండడం ఎంతో గర్వ కారణమన్నారు. బిఆర్.అంబేద్కర్ ఇచ్చిన గొప్ప ఎనలేని సంపద రాజ్యాంగం వల్లనే మనమంతా ప్రజాస్వామ్యంలో బలంగా నిలబడగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రెడ్డి రామకృష్ణ, కార్యదర్శి ఏ గోవింద నాయుడు, జాయింట్ సెక్రటరీ ఎస్ రవీంద్ర మోహన్, ట్రెజరర్ వి. ఎన్.శర్మ, చింతాడ డేవిడ్, జాగాన రామినాయుడు తదితరులు పాల్గొన్నారు.