ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
రాజ్యాంగ పరిరక్షణకై పాద యాత్ర
Updated on: 2025-04-05 20:51:00

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మొర్రయిపల్లె గ్రామంలో అట్టహాసంగా ప్రారంభమైన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ పాద యాత్ర. ఈ కార్యక్రమానికి మండల ఇంచార్జ్ మాజీ జెడ్పిటిసి నాగం కుమార్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాజ్యాంగం ద్వారానే ఈరోజు మనం ఎంతో స్వేచ్ఛగా బతుకుతున్నామని రాజ్యాంగాన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. రాజ్యాంగం అంటే కేవలం ఒక పుస్తకం కాదు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ మరియు జ్యోతిరావు బాపులే లాంటి ఎందరో మహానుభావుల ఆలోచనల విధానాలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు. బిజెపి అధికారంలోకి రావడానికి ముందు దేవుని పేరు చెప్పి మాయమాటలుచెప్పి, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రేపుతు హిందుత్వ ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నదని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్చార్జ్ నాగం కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ని పక్కనపెట్టి కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజలమధ్య కుల, మత బేధాలు తీసుకొచ్చి నయవంచన చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పార్లమెంటులో హోం మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను ఇప్పటికైనా వెనుక్కి తీసుకోవాలని అన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తిని బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సింలు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండం రాజిరెడ్డి, మాజీ ఎంపిటిసి ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ బిసి సెల్ మండల అధ్యక్షులు, పలు గ్రామ శాఖ అధ్యక్షులు జిల్లా నాయకులు, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు, మండల నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.