ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
దొడ్డి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ
Updated on: 2025-04-03 19:53:00

దొడ్డి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మండల యాదవ కురుమ సంఘం ఆధ్వర్యంలో 98 వ జయంతిని పురస్కరించుకొని ఒగ్గు డోలు కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ర్యాలీతో వచ్చి తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రాగం నాగరాజు మాట్లాడుతూ కొమరయ్య 1927 ఏప్రిల్ 3న తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో సాధారణ గొర్రెల పెంపకందార్ల కుటుంబంలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడయ్యాడు. 1946 జులై 4 న విసునూర్ రామచంద్రారెడ్డి అల్లరి మూకలు రౌడీలతో 40 మంది వచ్చారు. ప్రజలంతా ఏకమై కర్రలు, బడిశెలు, గునపాలు అందుకుని గుండాలను తరిమికొట్టారు. దొర గుండాల తుపాకి తూటాలకు నేలరాలిన అరుణతార, తెలంగాణ విప్లవంలో చెరగని ముద్రవేసుకున్నాడు దొడ్డి కొమురయ్య అని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, యస్ఐ గణేష్, కోడె శ్రీనివాస్, అధికార ప్రతినిధులు, మండలంలోని వివిధ పార్టీల నాయకులు మరియు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు