ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
వరంగల్ మిర్చికి అరుదైన ఘనత.. చపాటకు జీఐ ట్యాగ్..
Updated on: 2025-04-03 09:53:00

TG:ప్రపంచ వ్యాప్తంగా ఆహారపు వ్యవసాయ ఉత్పత్తులు జాబితాలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది ఓరుగల్లు చిల్లీ..వరంగల్ చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ లభించింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం, కొండా లక్ష్మణ్ వర్సిటీలు GI కోసం దరఖాస్తు చేశాయి. ఈ మిర్చికి ప్రత్యేకతలు ఉండటం వల్ల GI గుర్తింపు లభించిందని.. కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సటీ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి ధ్రువీకరణ పత్రం అందిందని ఆయన వెల్లడించారు.