ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యుల సర్వసభ్య సాధారణ సమావేశం
Updated on: 2025-03-31 21:18:00

బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మరడ రామి నాయుడు అధ్యక్షతన అధ్యక్షులు రేవళ్ల కిరణకుమార్ పర్యవేక్షణలో బొబ్బిలి పాతకోట లో గల సంఘం కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల నిర్వహించిన జిల్లా సైనిక అధికారి నిర్వహించిన క్యాంప్ సదస్సుపై చర్చించారు. క్యాంప్ విజయవంతంగా మీ అందరి సహాయ సహకారాలతో జరిగిందని అధ్యక్షులు తెలియజేశారు. ట్రెజరర్ వి ఎన్ శర్మ మార్చి నెల లో జరిగిన రాబడి, ఖర్చుల వివరాలు సభ్యులకు తెలియజేశారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ సంఘము యొక్క అను శాసనం, కార్యనిర్వహణ ,సభ్యుల హాజరు, మంత్లీ సబ్ స్క్రిప్షన్.. తదితర అంశాలపై కూలంకషంగా వివరించారు.చివరగా గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ సభ్యులందరూ కోపరేటివ్ గా ఉండాలని, కార్యాలయ మెయింటినెన్స్ ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రతి మీటింగుకు సభ్యులందరూ హాజరు కావాలని, ప్రతినెలా కటింగ్ అందరూ జమ చేయాలని.. సూచించారు. సభ్యుల వద్ద నుంచి ఇంకా ఏ సజెషన్ పాయింట్ లేనందున సమావేశం 7 గంటలకు ముగిసినది. ఈ సమావేశంలో బొబ్బిలి పరిసర ప్రాంతాల పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు.