ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మండలాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
Updated on: 2025-03-27 21:22:00

ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పరిశీలన మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా చిప్పలపల్లి గ్రామంలో మిషన్ భగీరథ అధికారులతో కలిసి పరిశీలించారు
గ్రామంలో నీటి సరఫరా పై అధికారులను ఆరా తీశారు. డిమాండ్ ఎంత? సరఫరా ఎంత అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముస్తాబాద్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూం ప్రాంతం, ఎస్సీ కాలనీ లో పర్యటించి, నీటి సరఫరా పై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ వేసవిలో ఎక్కడా తాగు నీటి సమస్య రాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. దీనికి కావాల్సిన సామాగ్రిని సేకరించాలని, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి విద్యాలయం ఆవరణ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
ముస్తాబాద్ మండలం నామాపూర్ లోని మోడల్ స్కూల్ లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు పరిశీలించారు. అనంతరం హాస్టల్ లో కిచెన్ గది, స్టోర్ రూమ్, సామాగ్రిని తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయి? ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని పలువురు పేషెంట్ల ను కలెక్టర్ ఆరా తీశారు. ముస్తాబాద్ మండలం పోత్గల్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఓపీ, సిబ్బంది రిజిస్టర్, ల్యాబ్, మందులు పంపిణీ చేసి గది, ఇన్ పేషెంట్ వార్డ్, వ్యాక్సిన్ గదిని పరిశీలించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవలపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. సర్కార్ ఆసుపత్రిల్లోనే ఎక్కువ సంఖ్యలో డెలివరీ లు అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇక్కడి పిహెచ్ కి కావాల్సిన వైద్యులు, సిబ్బందిని త్వరలో నియమిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు జానకి, ప్రేమ్ కుమార్, రాము, ఎంపీడీవో బీరయ్య, డాక్టర్ గీతాంజలి తదితరులు