ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
కడిపికొండ,మైనారిటీ బాలుల గురుకుల పాఠశాలలో వసతులను తనిఖీ చేసిన హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి
Updated on: 2025-03-26 17:12:00
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ పరిధిలో ఉన్న తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలోని వసతులను హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు.పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన భోజన పదార్థాలను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. అదేవిధంగా స్టోర్ రూమ్ లో భద్రపరిచిన బియ్యం సంచులు, వంట నూనెలు, ఆహార పదార్థాలను పరిశీలించారు. గురుకుల పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం , ఇతర ఆహార పదార్థాలను విద్యార్థులకు అందిస్తున్నారా అని అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాలు ఉండాలని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులు, పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులకు సూచించారు.