ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి మొండిచెయ్యి
Updated on: 2025-03-21 20:42:00
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించబడిన నిధులు చాలా అరకొరగా ఉన్నయంటూ, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు పెంట అంజయ్య పేర్కొన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకపోవడం శోచనీయం అన్నారు. ఈ బడ్జెట్ విద్యావ్యవస్థను చాలా తీవ్ర నిరాశకు గురి చేసినట్టుగా ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసంగా 15% నిధులు కేటాయిస్తారని అనుకున్నట్లుగా తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 7.57% నిధులు కేటాయించి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విద్యా రంగం చాలా వెనుకబడి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా విద్యావ్యవస్థ మరింతగా కుంటుపడేలా ఉందన్నారు. అంతేకాకుండా మేధావి వర్గాన్ని తయారు చేసే పరిశ్రమలుగా, కర్మాగారాలుగా భావించబడే యూనివర్సిటీలకి సహితం రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్ లో కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించబడటం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిధులు లేక విలవిలాడే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా? అంటూ ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన విద్యావ్యవస్థకి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గాడిలో పెడుతుందని ఆశించిన విద్యారంగానికి మళ్ళీ మొండి చేయే దక్కిందన్నారు. ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు గత ప్రభుత్వాన్ని అనుసరించనట్లుగా ఉండటం విచారంగా ఉందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. విద్యారంగానికి తగినన్ని నిధులు కేటాయించి విద్యారంగంలో తెలంగాణని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని ఆశించారు. రానున్న రోజులలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి తగిన నిధులు కేటాయించి, విద్యవ్యవస్థ బాగుపడే విధంగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.