ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
పది లీటర్ల నాటుసారా, వంద కిలోల బెల్లం పట్టివేత
Updated on: 2025-03-21 20:18:00
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలంలో అప్కారి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎల్లారెడ్దిపేట ఎక్సైజ్ పరిధిలోని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ అందించిన వివరాల ప్రకారం. మోర్రపూర్, సేవాలాల్ తండాలలో తనిఖీలు నిర్వహించినట్లుగా తెలిపారు. మోర్రపూర్, సేవాలాల్ తండాలలోని పలువురు వద్ద నుండి పది లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని పారబోసినట్లుగా పేర్కొన్నారు. అక్రమంగా నాటుసారా తయారీ చేస్తున్న పలువురుపై కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు. నాటుసారా తయారీ చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయన్నారు. మండల కేంద్రంలోని పల్లపు లలిత వద్ద నుండి అయిదు లీటర్ల నాటుసారాని స్వాదీనపర్చుకున్నట్లుగా తెలిపారు. అనంతరం నమ్మదగిన సమాచారం మేరకు ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలు కిరాణా వర్తక షాపులలో తనిఖీలు నిర్వహించారు. కిరాణా షాపులలో దాదాపుగా వంద కిలోల నల్ల బెల్లం లభించిందన్నారు. బెల్లం దొరికిన సదరు కిరాణా షాపుల ఓనర్లపై కేసులు నమోదు చేసి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బైండొవర్ చేశామన్నారు. అదే సమయంలో నామాపూర్ శివారు ప్రాంతంలో వాహనాలు చెక్ చేస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులకి టీవీఎస్ ఎక్సెల్ పై వెళుతున్న ఓ వ్యక్తి వద్ద ఐదు లీటర్ల నాటుసారా లభించిందన్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి అతని వాహనాన్ని సీజ్ చేసినట్లుగా ప్రకటించారు. మండలంలో ఒకేరోజు ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది రాజేందర్, రాజు, మల్లేష్,కిషోర్ కుమార్,కృష్ణ కాంత్, లలితలు పాల్గొన్నారు.