ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
రంజాన్ మాసం పురస్కరించుకొని ఎమ్మెల్యే గళ్ళ మాధవి చేతుల మీదుగా పేదలకు దుస్తుల పంపిణీ
Updated on: 2025-03-17 12:11:00

రంజాన్ మాసం పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి చేతుల మీదుగా పేదలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం విద్యానగర్ లో ఆదివారం జరిగింది. టీడీపీ నేత అల్తాఫ్, సాహీర బానులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళ మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యి పేదలకు దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళ మాధవి మాట్లాడుతూ... ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన నెల రమజాన్ నెల అని, క్రమశిక్షణ, దాతృత్వం, ఆధ్యాత్మిక చింతన. ఈ మూడింటి కలయికే రంజాన్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ నెలల్లో అత్యంత నిష్టతో కఠినమైన ఉపవాసాలు ఆచరిస్తారని, ఈ నెలలో పేదలకు సదఖా పేరుతో సహాయము చేస్తారని, ఇందులో భాగంగా అల్తాఫ్ ముందు వచ్చి ఎంతమందికి దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టటం అభినందనీయమన్ని ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. కార్యక్రమంలో కొమ్మినేని కోటేశ్వరరావు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ మరియు గంటా పెద్దబ్బాయి, మౌళిక, దిలావర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.