ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతుగా నిలిచారు:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
Updated on: 2025-03-04 12:35:00

గుడివాడ మార్చి04:కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుభాకాంక్షలు తెలియజేశారు. గుడివాడ టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ...కూటమి ప్రగతికి మద్దతుగా నిలిచిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.ఆలపాటి రాజా అఖండ విజయం సాధించేలా కష్టపడిన టిడిపి - జనసేన - బిజెపి పార్టీల శ్రేణులను ఎమ్మెల్యే రాము అభినందించారు. ప్రతి రౌండ్లో తిరుగులేని మెజార్టీతో ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించడం గొప్ప విషయం అన్నారు.ఈ ఎన్నికలో పట్టబద్రులు మరియు ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ... కూటమి అభ్యర్థికి ఏకపక్షంగా తమ ఓటు వేయడం సంతోషకరమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రజలు,పట్టభద్రుల ఆకాంక్షలకు అనుగుణంగానే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి,ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు