ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో మంత్రి సమావేశం
Updated on: 2023-06-26 17:36:00

కుమ్రం భీం - ఆసిఫాబాద్: ఈ నెల 30న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అసిఫాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని, సీఎం పాల్గొనే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో ఈ నెల 30న సీయం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. సభ స్థలం, ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.... బీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో పని చేసి సీయం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలన్నారు. భారీ బహిరంగ సభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా చూడాలని నాయకులకు సూచించారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీయం కేసీఆర్ ప్రారంభించనున్నారు. లాంఛనంగా పోడు పట్టాలను సీయం పంపిణీ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు.