ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
జిల్లాలీ పఠనోత్సనం
Updated on: 2023-06-26 17:36:00

నిర్మల్ జిల్లాలో పఠనోత్సవం కార్యక్రమం ప్రారంభం. నిర్మల్ జిల్లాలోని ఆయ పాఠశాలలో పఠణోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భముగా పొరెడ్డి అశోక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పఠనోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సంవత్సరం పిల్లల్లో ధారాళంగా చదివే విధంగా, చదివిన దానిని అర్థం చేసుకుని రాసే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు తయారు చేసిన బోధ్నాభ్యాసన సామాగ్రి రూం టు రీడ్ వారు ఇచ్చిన పుస్తకాలను పిల్లలచే చదివించారు. ఉపాధ్యాయులు పిల్లల్ని మూడు గ్రూపులుగా గ్రూపులుగా విభజించి, సామూహిక అభ్యసనం జట్టు అభ్యసనం అదేవిధంగా వ్యక్తిగత అభ్యసనం జరిగే విధంగా చూడాలని ఉపాధ్యాయులను కోరారు. పిల్లలందరూ గ్రంథాలయ పుస్తకాలను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలో ప్రతిరోజు ఒక ప్రత్యేక పీరియడ్ ఉండాలని కోరారు. ఉపాధ్యాయులు వారు బోధిస్తున్న సమయంలో పది నిమిషాలు చదవడానికి పిల్లలతో చదివించడానికి సమయం కేటాయించాలని కోరారు. జట్లుగా చేసి పిల్లల సామర్థ్యాలకు అనుగుణంగా పుస్తకాలను ఇచ్చి చదువుకునేలా చేయాలన్నారు. పిల్లలు ఇంటి వద్ద కూడా గ్రంథాలయ పుస్తకాలను వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మహేందర్ , రమేష్ బాబు , సురేందర్ , నవిత , రూంటురీడ్ జిల్లా ఇంఛార్జి రవి , కోఆర్డినేటర్ గోవర్ధన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.