ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
గుడివాడలో ప్రధాన రహదారుల అభివృద్ధికి అంచనాలు
Updated on: 2025-02-26 09:42:00

గుడివాడ: గుడివాడ పట్టణంలో రహదారుల అభివృద్ధికి తక్షణం డీపీఆర్ సిద్ధం చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాలతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ(మోర్త్) అధికారులు గుడివాడ పట్టణంలో కార్యాచరణ ప్రారంభించారు. జాతీయ రహదారులు సంస్థ డీఈఈ సత్యన్నారాయణ, ఏఈ శరత్చంద్ర నేతృత్వంలో సిబ్బంది డీపీఆర్ కోసం మార్కెట్ సెంటర్ నుంచి నెహ్రూచౌక్ మీదుగా వీకేఆర్ కళాశాల వరకు కొలతలు వేశారు. వీధి దీపాలు, రెండు వైపులా డ్రెయిన్లు, వాటిపై టైల్స్ తదితరాల నిర్మాణానికి అంచనాలు రూపొందిస్తు న్నారు. పట్టణం నలుమూలల రహదారులు, బైపాస్ రోడ్డు అభివృద్ధి, రెండు వైపులా సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించే పనులు శరవేగంగా సాగుతున్నాయి.