ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
జగన్ మోహన్ రెడ్డి & కో డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు - ఎమ్మెల్యే గళ్ళా మాధవి
Updated on: 2025-02-24 16:59:00

వైసిపి అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్ మోహన్ రెడ్డి & కో ఆరోజు అసెంబ్లీలో చేసిన డ్రామాను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఎద్దేవా చేశారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ... అసెంబ్లీలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన జగన్ రెడ్డి, ఈ రోజు వరకు ప్రజా దేవాలయం లాంటి అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదని, అసెంబ్లీకి రాకాపోతే అనర్హతటు వేస్తారనే భయంతో అసెంబ్లీకి వచ్చి, గవర్నర్ ప్రసంగం సమయంలో వారి సభ్యులతో "జగన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా" ఇవ్వాలని నినాదాలు చేయించి, వాక్ అవుట్ పేరుతో డ్రామాలు ఆడి బయటకి వెళ్ళిపోవటం చూసిన రాష్ట్ర ప్రజలలో చులకన అయ్యారని,
నిన్నటి నుండి బ్లూ మీడియా మొదలు పేటియం బ్యాచ్ వరకు చెలరేగిపోయి "నిలదీస్తాడు, కడిగేస్తాడు" అని ఊదర గొట్టారని, కానీ జగన్ రెడ్డి ఫోటో దిగి వెళ్లిపోయాడని, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు,వ్యవస్థలు ఇవ్వాలి కానీ,డిమాండ్ చేసి, ఆందోళనలు చేస్తే రాదన్న విషయము జగన్ రెడ్డికి కూడా తెలుసునని "తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో 23 సీట్లు సాధించింది. నలుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుందంటూ జగన్ చేసిన కామెంట్స్ గుర్తు చేస్తున్నామని గళ్ళా మాధవి తెలిపారు. ప్రజా సమస్యల ఫై వైసిపికి నిజంగా చిత్తశుద్ధి ఉంటె ప్రతిపక్ష హోదానే అవసరం లేదని, అసెంబ్లీకి వస్తే చాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు.