ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
128 కేంద్రాల్లో పదవ తరగతి పరీక్షలు : జిల్లా రెవెన్యూ అధికారి మురళి
Updated on: 2025-02-10 18:42:00

నరసరావు పేట, ఫిబ్రవరి 10 జిల్లాలో మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు 128 కేంద్రాల్లో నిర్వహించానున్నామని జిల్లా రెవిన్యూ అధికారి మురళి వెల్లడించారు. రెగ్యులర్ మరియు ఓపెన్ స్కూల్ విధానంలో కలిపి మొత్తం 26597 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. వీరిలో ఓపెన్ స్కూల్ విధానంలో 1200 మంది రాయనున్నారన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని బీఆర్ అంబేద్కర్ సమావేశ మందిరంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలు మరియు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను నరసరావు పేట మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావుకు అప్పగించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక హెల్త్ అసిస్టెంట్ ను అందుబాటులో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఏ పరీక్షా కేంద్రానికి అయినా చేరుకునే విధంగా కీలక ప్రాంతాల్లో మెడికల్ వ్యాన్లను సిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా బస్సులు నిర్వహించాలని ఆర్టీసీ ప్రతినిథులను కోరారు.