ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
కళ్యాణదుర్గం లో జబర్దస్త్ టీం సభ్యుల సందడి
Updated on: 2025-02-08 20:20:00
శ్రీ పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి కళ్యాణదుర్గం పట్టణంలో జబర్దస్త్ టీం సభ్యులు సందడి చేయబోతున్నారు. హాస్య భరిత నాటికలు, జబర్దస్త్ జోకులతో పట్టణ వాసులను, భక్తులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. శనివారం ఉదయం హైదరాబాదు నుండి కళ్యాణదుర్గం వచ్చిన జబర్దస్త్ టీం సభ్యులు గడ్డం నవీన్, అప్పారావు, పవన్ తదితరులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చారు. అక్కమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి కళ్యాణదుర్గం చరిత్రను తెలుసుకున్నారు. ఈ రాత్రి 8.30 గంటల నుండి పొద్దుపోయేదాకా స్థానిక దిన మార్కెట్ ఆవరణంలో సందడి చేయబోతున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు , ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారనీ, వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినట్లు హాస్యనటులు చెప్పారు.